Skip to playerSkip to main content
  • 7 years ago
Kuldeep Yadav, the Indian cricketer, has been one of the best spinners in the past few years. He recently won the second place in the ICC Teams' 20 rankings.''Shane warne advices was useful to me, "says Kuldeep.
#indiavsaustralia
#kuldeepyadav
#shanewarne
#australia
#teamindia
#ipl
#kolkataknightriders
#ravisashtri
Brad Hodge

గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్. ఇటీవలే ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో ఫైవ్ వికెట్ హాల్ తీశాడు. ముఖ్యంగా తన బౌలింగ్‌తో ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశాడు. అయితే, వర్షం కారణంగా ఆఖరి టెస్టు రద్దు అయినప్పటికీ... అప్పటికే టెస్టు సిరిస్‌ను 2-1తో టీమిండియా కైవసం చేసుకుంది. తద్వారా ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు సిరిస్ నెగ్గిన ఆసియా దేశంగా భారత్ నిలిచింది.తాజాగా ఆస్ట్రేలియా పర్యటనలో మాజీ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్‌తో మాట్లాడిన అనుభవం ఉపయోగపడిందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు కుల్దీప్ మాట్లాడుతూ "మేం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు షేన్‌ వార్న్‌ మాకు బాగా దగ్గరయ్యారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రతిరోజూ ఉదయాన్నే ఆయనతో నేను మాట్లడేవాడిని. నా బౌలింగ్‌ గురించి ఇద్దరం చర్చించుకునే వాళ్లం" అని అన్నాడు.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended