Skip to playerSkip to main content
  • 7 years ago
After long time ap cm chandrababu naidu met with national leaders. on the occasion of jumaraswamy oath taking cermany he went karnataka and discussed about third front against nda. babu conducted separate meetings with mamtha benarji, kejrival, sharad pawar, sitaram echuri.

బీజెపి ప్ర‌భుత్వం నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ద్రుష్టి జాతీయ రాజ‌కీయాల‌పైపు మ‌ళ్లిన‌ట్టు తెలుస్తోంది. క‌ర్నాట‌క లో కుమార స్వామి ప్ర‌మాణ స్వీకారానికి వెళ్లిన చంద్ర‌బాబు హుషారుగా క‌నిపించారు.
జాతీయ రాజకీయాల పై తనకు ఆసక్తిలేదని గత కొంత కాలంగా చెబుతూ వస్తోన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిలో ప్రస్తుతం మార్పు కనిపిస్తోంది. బీజేపీతో సంబంధాలు తెగతెంపులు చేసుకున్న తర్వాత జాతీయ రాజకీయాల అంశంలో బాబు ఆలోచన మారినట్టు అర్థమవుతోంది. తాజాగా బాబు బెంగుళూరు పర్యటనలో ఈ విషయం స్పష్టంగా వెల్లడైంది. కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఉదయమే బెంగుళూరు చేరుకున్న చంద్రబాబు ఫుల్ బిజీబిజీగా గడిపారు. మమత బెనర్జీ, మాయావతి, కేజ్రీవాల్, సురవరం లాంటి హేమాహేమీ నేతలతో వరుస భేటీలు నిర్వహించారు.
ఎన్డీయేకు, మోడీకి వ్యతిరేకంగా ఈ భేటీలలో కీలక చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో మోడీని ఓడించేందుకు అందరం ఏకమవ్వాలన్న అభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. ప్రాంతీయ పార్టీలే కీలకంగా కూటమికట్టాలని భావించినట్టు తెలిసింది. చర్చల్లో ఎక్కడా కాంగ్రెస్ ప్రస్థావన పెద్దగా లేదు. అయితే, అంతిమంగా కాంగ్రెస్ కూడా కూటమిలో భాగస్వామిగా ఉండే అవకాశం ఉంది. మొదట్లోనే కాంగ్రెస్ వేదికగా కూటమి రూపకల్పన చేయకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended