Skip to playerSkip to main content
  • 7 years ago
Chennai Super Kings is a close-knit unit and its players are a big family. Recently, batsman Suresh Raina’s daughter Gracia turned 2, and players like MS Dhoni and Harbhajan Singh attended her birthday party.
#IPL2018
#Dhoni
#Dwayne Bravo
#Suresh Raina



ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2018 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న సురేశ్‌ రైనా కుమార్తె గ్రేసియా పుట్టిన రోజు వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. గ్రేసియా పుట్టిన రోజు వేడుకలను మంగళవారం ఢిల్లీలో నిర్వహించారు.
ఈ పుట్టినరోజు కార్యక్రమానికి చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాళ్లు ధోనీ, బ్రావో, హర్భజన్‌ సింగ్‌ తదితరులు హాజరై సందడి చేశారు. వీరితో పాటు రైనా బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో చెన్నై ఆటగాళ్లు పాల్గొన్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
బ్రావో అయితే పాటలు పాడుతూ, డ్యాన్స్‌లు చేస్తూ సందడి చేశాడు. హర్భజన్‌ సింగ్ భార్య గీతా బస్రా కుమార్తె హినయాతో కలిసి ఈ వేడుకలకు హాజరైంది. ఇదిలా ఉంటే ఐపీఎల్ టోర్నీలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తన తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టుతో తలపడనుంది.
ఈ నేపథ్యంలో ఆటగాళ్లందరూ మంగళవారం ఢిల్లీ చేరుకున్నారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న తొలి జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలవగా.... ఆ తర్వాత చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇప్పటికే ప్లేఆఫ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా చెన్నై ఇక రెండు మ్యాచ్‌లు ఆడనుంది.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended