Skip to playerSkip to main contentSkip to footer
  • 12/13/2017
The government has indefinitely extended the time for mandatory linking of Aadhaar with bank accounts

బ్యాంకు సేవలకు ఆధార్‌ కార్డ్ అనుసంధానం తప్పనిసరి చేయాలని తీసుకున్న నిర్ణయంపై కేంద్రం వెనక్కి తగ్గింది. ఆధార్‌ అనుసంధానం చేసుకునేందుకు డిసెంబరు 31 చివరి తేదీ. తాజాగా దానిని ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
ఈ మేరకు ఓ గెజిట్‌ నోటిఫికేషన్‌ను బుధవారం విడుదల చేసింది. ఆధార్‌ అనుసంధానాన్ని వ్యతిరేకిస్తూ పలువురు సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై విచారణను సుప్రీం కోర్టు గురువారం చేపట్టనుంది. ఈ నేపథ్యంలోనే బ్యాంకు సేవలకు ఆధార్‌ అనుసంధాన గడువును ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే ఎప్పటిలోగా ఆధార్‌ అనుసంధానం చేసుకోవాలనే దానికి సంబంధించిన కొత్త తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

Category

🗞
News

Recommended