Minister Gottipati Ravi Inspected Damaged Power Lines : 2 తుపాన్ల కారణంగా విద్యుత్ శాఖకు 500 కోట్ల రూపాయలకుపైగా నష్టం వాటిల్లిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలో పాటు సంతనూతలపాడులో ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌తో కలిసి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లను పరిశీలించారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ నుంచి 3 వేల మందికిపైగా సిబ్బంది విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సీఎం చంద్రబాబు మాట్లాడి సిబ్బందిని రప్పించారని, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మురసు తుపానుతో 7,500కు పైగా విద్యుత్ స్తంభాలు, కండక్టర్లు, డీటీఆర్‌లు దెబ్బతిన్నాయని మంత్రి పేర్కొన్నారు. నాగులుప్పలపాడులో విద్యుత్తు స్తంభాలతోపాటు పొగాకు బ్యారన్లు, ఇళ్లు దెబ్బ తిన్నాయని అన్నారు. గోదావరి జిల్లాల్లో విద్యుత్ పునరుద్ధరణ పూర్తైందని, ఈ రోజు(శుక్రవారం) సాయంత్రానికి 70 శాతం, శనివారం సాయంత్రానికి పూర్తి స్థాయిలో పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. వినియోగదారులతో పాటు వ్యవసాయ, ఆక్వా రంగాలకు విడతల వారీగా విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.