Skip to playerSkip to main content
  • 23 minutes ago
Massive Sea Waves Surging along Uppada coast : కాకినాడ జిల్లాలో అర్నబ్ తుపాను ప్రభావం కనిపిస్తోంది. పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ సముద్రతీరంలో అలలు ఉద్ధృతంగా ఎగసిపడుతున్నాయి. సముద్రం ముందుకు చొచ్చుకురావడంతో రోడ్డును తాకుతూ అలలు విరుచుకుపడుతున్నాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా కాకినాడ–ఉప్పాడ బీచ్‌ రోడ్డును అధికారులు మూసివేశారు. కొత్తపట్నం సమీపంలో సముద్రపు కోతను అడ్డుకునేందుకు వేసిన రాళ్లపై నుంచి అలలు ఎగసిపడుతున్నాయి. చిన్న బ్రిడ్జి వద్ద సముద్రం ఉద్ధృతంగా కనిపిస్తోంది. సూరాడపేట, జగ్గరాజుపేట, మాయాపట్నం, కోనపాపేట తదితర తీర గ్రామాల వద్ద అలలు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రత్యేక బృందాలు ఉప్పాడకు చేరుకున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు సముద్ర పరిస్థితిని పర్యవేక్షిస్తూ మత్స్యకారులను అప్రమత్తం చేస్తున్నారు. తుపాను తీవ్రత పెరిగితే తీర ప్రాంతంలో నివసిస్తున్న మత్స్యకారులు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని ఇప్పటికే గ్రామాల్లో సూచించారు. సముద్రం ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Category

🗞
News
Transcript
00:28Transcribed by ESO, translated by —

Recommended