Skip to playerSkip to main content
  • 7 weeks ago
Ys Jagan On Padayatra : గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ నాయకుల సమావేశంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్​ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌ లేదా అక్టోబర్​లో పాదయాత్ర చేపట్టనున్నట్టు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయో లేదో చెప్పలేమన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం తెచ్చిన 34 శాతం బీసీ రిజర్వేషన్లను కోర్టులు కొట్టేస్తాయని చెప్పారు. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుసన్నారు. అయినా ఎన్నికలకు సిద్ధంకావాలని స్పష్టం చేశారు. ఒకవేళ ఎన్నికలు జరిగితే అవి కురుక్షేత్ర సంగ్రామమేనని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఎన్నికలపై కన్నేసి ఉంచాలని నాయకులకు సూచించారు. కనీవినీ ఎరుగని రీతిలో వైఎస్సార్సీపీ పాలన సాగిందన్నారు. ఈ విషయం గురించే ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోందని చెప్పారు. దౌర్జన్యంతో పాలకులు ఎప్పుడూ రాజ్యం చేయలేరని తెలిపారు. పాలకుడు ఎప్పుడైనా మంచి చేసి దాన్ని చూపి ఓటు అడగాలని అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడని ప్రజలు ఆదరిస్తారని జగన్ హితబోధ చేశారు.

Category

🗞
News
Transcript
00:10To be continued...

Recommended