Skip to playerSkip to main content
  • 19 hours ago
Shortage Of Water In Govt School : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. ముఖ్యంగా హఫీజ్‌పేట్, రాయదుర్గం ప్రాథమిక పాఠశాలల్లో మంచినీటి కొరతతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాయదుర్గం ప్రాథమిక పాఠశాలలో కనీస నీటి వసతులు కరవయ్యాయి. మంజీరా నీటి కనెక్షన్ లేక, బోర్ సౌకర్యం కూడా సరిగ్గా లేకపోవడంతో నీటి ఎద్దడి నెలకొంది. పాఠశాలల్లో ఉదయం ముఖ్యమంత్రి అల్పాహారం పథకం, మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత ప్లేట్లు కడుక్కోవడానికి విద్యార్థులు తీవ్ర నరకం చూస్తున్నారు. కనీసం చేతులు కడుక్కోవడానికి, వాష్‌రూమ్‌లు ఉపయోగించడానికి కూడా నీళ్లు లేకపోవడంతో తీవ్ర దుర్గంధం, అపరిశుభ్రత ఏర్పడుతోందని వాపోతున్నారు.పాఠశాలకు మంజీరా వాటర్ కనెక్షన్ లేదు. బోర్ వేసినా పగటిపూట నీళ్లు రావు. కేవలం రాత్రి వేళల్లో మోటారు వేస్తే కొద్దిగా నీళ్లు వస్తాయి. వాటినే వాడుకుంటున్నాం. తాగునీటి కోసం దాతలు రోజుకు 2 నుంచి 3 వాటర్ బబుల్స్ పంపిస్తున్నారు. ప్రస్తుతం వాటితోనే విద్యార్థుల దాహార్తిని తీరుస్తూ సర్దుబాటు చేస్తున్నాం - శ్రీనివాస్, హఫీజ్‌పేట్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు

Category

🗞
News

Recommended