Skip to playerSkip to main content
  • 2 days ago
Dasara Tourist Rush to Maredumilli : దసరా పండగ సెలవులను పురస్కరించుకుని మన్యం ప్రాంతం పర్యాటకులతో కిటకిటలాడింది. ప్రకృతి రమణీయతను ఆస్వాదించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా పోలవరం జిల్లాలోని రంపచోడవరం, మారేడుమిల్లి అటవీ ప్రాంతాలకు సందర్శకుల తాకిడి విపరీతంగా పెరిగింది. ఎత్తయిన కొండలు, పచ్చని చెట్లు, జలపాతాల అందాలను చూసి వారు మురిసిపోయారు. పండగ సెలవులు కావడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి విచ్చేసి సందడిగా గడిపారు. మారేడుమిల్లిలోని చావిడికోట పర్యాటక ప్రాంతం అందరినీ విశేషంగా ఆకర్షించింది. ఇక్కడ కొండల దిగువన కమ్ముకున్న మేఘాలు చూపరులకు కనువిందు చేశాయి. ఈ ప్రకృతి అందాల మధ్య నిలబడి సెల్ఫీలు తీసుకుంటూ ఉత్సాహంగా గడిపారు. మరోవైపు రంపచోడవరం మండలంలోని భూపతిపాలెం జలాశయం వద్ద కూడా పర్యాటకుల కోలాహలం నెలకొంది. చుట్టూ పచ్చని కొండల మధ్య నిశ్చలంగా ఉన్న నీటి సోయగాలను చూసి తన్మయత్వం చెందారు. అలాగే, సమీపంలోని ప్రసిద్ధ జలతరంగిణి జలపాతం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంది. పైనుంచి జాలువారే నీటి ధారలను చూసి మంత్రముగ్ధులయ్యారు. 

Category

🗞
News
Transcript
00:00What

Recommended