Tiger Delighting In Amrabad Zone : నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో సఫారీ చేసేందుకు వెళ్లిన సందర్శకులకు పులి కనువిందు చేసింది. ఈ సఫారీలో భాగంగా శనివారం ఉదయం మున్ననూరు నుంచి పర్యాటకులను ఫర్హాబాద్ దగ్గరున్న వ్యూ పాయింట్ వద్దకు సిబ్బంది తీసుకొని వెళ్లే క్రమంలో పులి తారసపడింది. దాన్ని చూసేందుకు సిబ్బంది వాహనాన్ని అక్కడే నిలిపివేశారు. సుమారు గంట పాటు పులి అక్కడే ఉండిపోవడంతో సఫారీని కూడా ఆపేశారు.పులి అక్కణ్నుంచి వెళ్లిన తర్వాతే వారి ప్రయాణాన్ని ముందుకు కొనసాగించారు. మధ్యాహ్నం 12 గంటలకు వచ్చిన సందర్శకులకు కూడా అరగంట పాటు పులి కనిపించిందని సిబ్బంది వెల్లడించారు. అయితే, గతంలో చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే పులి కనిపించేదని, కానీ ఈ నెలలో తరచూ తారసపడుతోందని సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 36 పులులున్నాయని, వాటి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోందని వారు తెలిపారు.
Be the first to comment