CM Chandrababu Aerial View At Blowout Area in Konaseema District: అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ బ్లోఅవుట్ ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం ఘటనపై ఓఎన్జీసీ అధికారులు, కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్, ఎంపీ హరీశ్, ఎమ్మెల్యే వరప్రసాద్లతో మండపేట నియోజకవర్గం, రాయవరంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బ్లో అవుట్ నివారణకు సంబంధించిన చర్యలను సీఎం చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. వ్యాపించిన మంటల కారణంగా దెబ్బతిన్న కొబ్బరిచెట్లకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ నెల 5వ తేదీన సంభవించిన బ్లో అవుట్ మంటల తీవ్రత ఈరోజుకు మరింత తగ్గింది. అయితే ఓఎన్‌జీసీ బ్లో అవుట్ నుంచి మంటలు ఇంకా కొనసాగుతున్నాయి. గత 2 రోజులు కంటే ఈరోజు మంటల తీవ్రత తగ్గింది. 400 జీపీఎం సామర్థ్యం గల భారీ పంపు యంత్రంతో మంటలపై నీటిని నిరంతరాయంగా పంపుతున్నారు.
Be the first to comment