బంగాళాఖాతంలో నెలకొంటున్న పరిస్థితులు వాతావరణ నిపుణులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఒక అల్పపీడనం కొనసాగుతుండగానే.. మరోటి ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రెండు అల్పపీడనాలూ మనుగడ కోసం పోటీ పడనున్నాయి. రాబోయే రోజుల్లో రెండూ కలిసిపోయే అవకాశముంది. మలక్కా జలసంధి సమీపంలో ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ మంగళవారం నాటికి వాయుగుండంగా, గురువారంలోగా తుపానుగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఇది తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
Unusual developments in the Bay of Bengal are surprising weather experts. Even as one low-pressure area is active, signs of another formation have appeared. These two systems are expected to compete for survival, and there is a possibility that they may even merge in the coming days.
Be the first to comment