Fire Accident In Hyderabad : హైదరాబాద్ నగరంలోని చార్మినార్ పరిధిలో గుల్జార్ హౌస్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో రెండేళ్ల బాలుడు, ఏడేళ్ల బాలిక ఉన్నారు. ప్రమాద సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టి మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. భవనంలో చిక్కుకున్న కొంతమందిని వారు రక్షించారు. ప్రమాదం ధాటికి పలువురు స్పృహ కోల్పోయారు. బాధితులను చికిత్స నిమిత్తం ఉస్మానియా, హైదర్గూడ, డీఆర్డీవో ఆసుపత్రులకు తరలించారు. కాగా షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లుగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటన స్థానికంగా ఒక్కసారిగా కలకలం రేపింది.
Be the first to comment