సికింద్రాబాద్ అల్వాల్‌లోని ఓ హోటల్‌లో బిర్యానీ తినడానికి వెళ్లిన వినియోగదారులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. బిర్యానీ తింటున్న సమయంలో బొద్దింకలు ప్రత్యక్షం కావడంతో హోటల్ యజమాన్యంపై ఆహార ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహారంలో సరైన నాణ్యత లేకపోవడం, కిచెన్‌లో సరైన శుభ్రత లేకపోవడంతో వినియోగదారులు అసహనం వ్యక్తం చేశారు. వంట గదిలోని ఫ్రిజ్‌లో బూజు పట్టిన ఆహారపదార్థాలు ఉన్నాయని తెలిపారు. ఆహార భద్రత అధికారులు వెంటనే అపరిశుభ్రమైన ఆహారాన్ని విక్రయిస్తున్న హోటళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హోటల్లో ఆహారం తినాలంటే భయమోస్తుందని అంటున్నారు.
Be the first to comment