Sajjala Land Issue in AP : వైఎస్సార్సీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి 63.72 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని సర్కార్ నియమించిన కమిటీ తేల్చిచెప్పింది. అందులో అటవీ భూమి 52.40 ఎకరాలు ఉందని నివేదికలో పేర్కొంది. ఆక్రమించిన భూముల్లోని పండ్ల తోటలకు ప్రభుత్వ రాయితీలు సైతం పొందారని వెల్లడించింది. 8 చోట్ల అటవీ భూమి ఆక్రమించి జీవ వైవిధ్యానికి తీవ్ర నష్టం కలిగించారని పేర్కొంది. సజ్జల కుటుంబం భూ ఆక్రమణపై ప్రభుత్వానికి కమిటీ నివేదించింది.
Be the first to comment