Sajjala Estate Land Recovery : వైఎస్సార్ కడప జిల్లాలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబీకులు చెరబట్టిన అటవీ భూములకు విముక్తి లభించింది. సజ్జల ఎస్టేట్ ఆక్రమించిన 63 ఎకరాలను ఎకరాలను రెవెన్యూ అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ బోర్డులు పెట్టి హద్దులు పాతారు. వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేలా ఒకట్రెండు రోజుల్లో పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశంఉంది.