Hydra Demolitions in Mehdipatnam : హైడ్రా మరోసారి తన బుల్డోజర్లకు పని చెప్పింది. మెహదీపట్నంలో అక్రమంగా ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న షాపులను తొలగించింది. మెహదీపట్నం ఓల్డ్ ప్రిన్స్ హోటల్ లైన్లో అక్రమంగా ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న వ్యాపార సముదాయాలను, అక్రమంగా రోడ్డుపై పెట్టిన బోర్డులను, పాన్ షాప్‌లను హైడ్రా అధికారులు కూల్చివేశారు. కూల్చివేతల్లో మెహిదీపట్నం సర్కిల్ ఏసీపీ కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఎలాంటి గొడవ జరగకుండా స్థానిక హుమాయం నగర్ సీఐ మల్లేష్, మాసబ్ ట్యాంక్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ గౌడ్ పర్యవేక్షించారు.
Be the first to comment