MLA Peddireddy Reply To Bugga Matam Notices : తాను ప్రజాప్రతినిధినని ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల కారణంగా మీరు చెప్పినరోజు హాజరు కాలేనని అధికారులకు పుంగనూరు ఎమ్మెల్యే, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమాధానమిచ్చారు. తిరుపతి నగరంలోని తమ భూముల ఆక్రమణలపై హైకోర్టు ఆదేశాల మేరకు వివరణ ఇవ్వాలంటూ పెద్దిరెడ్డికి బుగ్గమఠం ఈవో వెంకటేశ్వర్లు నోటీసులు ఇచ్చారు. 17న మఠం కార్యాలయానికి వ్యక్తిగతంగా లేదా ప్రతినిధిని పంపి రికార్డులుంటే అప్పగించాలని పేర్కొన్నారు. నోటీసులు ఇచ్చిన సందర్భంలో తన తమ్ముడు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి ఆ భూములను కొన్నారని రామచంద్రారెడ్డి చెప్పారు. ఆ రికార్డులు అందిస్తానని మాత్రం తెలిపారు.