Dilraju on Allu Arjun issue : తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, ప్రొడ్యూసర్ దిల్ రాజు సంధ్య థియేటర్ ఘటనపై తొలిసారిగా స్పందించారు. ఇవాళ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ఆయన పరామర్శించారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. అనంతరం సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్ అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఇన్ని రోజులు అమెరికాలో ఉన్నందున రాలేకపోయానని తెలిపారు. అమెరికా నుంచి రాగానే సీఎం రేవంత్‌రెడ్డిని కలిసినట్లు తెలిపారు. అల్లు అర్జున్‌ను కూడా త్వరలో కలుస్తానని చెప్పారు.
Be the first to comment