TDP Leaders Fire On Ys Jagan Mohan Reddy : ఆస్తి పంపకాల వ్యవహారంలో సొంత తల్లి, చెల్లిపై కోర్టుకెళ్లిన వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత తల్లి, చెల్లికే న్యాయం చేయని వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తాడని జగన్పై ముప్పేట దాడి చేశారు. తల్లిని చెల్లిని బజారున పడేసిన అనైతిక చరిత్ర జగన్ రెడ్డిదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చిన వ్యక్తి జగన్ రెడ్డి అని దుయ్యబట్టారు. భారత కుటంబవ్యవస్థను ప్రపంచం అంతా గౌరవిస్తుంటే, ఆ విలువలకు తిలోదకాలిచ్చిన మహానీయుడు జగన్ అని మండిపడ్డారు.
Be the first to comment