YSRCP Former MLA Meka Pratap Apparao Irregularities: మొన్నపెద్దిరెడ్డి దురాక్రమణ పర్వం నిన్న జోగి రమేష్ భూ బాగోతం. వైఎస్సార్సీపీ హయాంలో భూములు పొగొట్టుకున్న బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తాజాగా ఏలూరు జిల్లా నూజివీడులో అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప అప్పారావు, ఆయన కుమారుడు సాగించిన భూ దందాలపై బాధితులు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. గత ఐదేళ్లు అధికారం అండతో చెలరేగిపోయిన అప్పారావు అడ్డగోలుగా రెవెన్యూ రికార్డులను మార్చి సామాన్యుల భూముల్లో గద్దల్లా వాలిపోయారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించిన రైతుల్ని తప్పుడు కేసులతో బెదిరించారు. 145 సెక్షన్ విధించి ఏకంగా ఇళ్ల నుంచి రైతుల్ని బలవంతంగా బయటకు పంపేశారు. ప్రభుత్వం మారడంతో వారంతా ధైర్యంగా బయటకు వచ్చారు. తిరిగి తమ ఇళ్లకు చేరుకున్నారు.