కలియుగంలో ధర్మానికి ప్రతిరూపం వెంకటేశ్వరస్వామి అని తాను సనాతనధర్మాన్ని పాటిస్తే అవహేళన చేసి మాట్లాడారని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏడు కొండలవాడికి అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటామని ఆయన అన్నారు. తిరుపతిలో నిర్వహించిన వారాహి సభలో ఆయన ప్రసంగించారు. తనకు అన్యాయం జరిగినా బయటకు రాలేదు కానీ సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వారితో గొడవ పెట్టుకోడానికి వచ్చానని పవన్ తెలిపారు.
Be the first to comment