HYDRA Ranganath : కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జులై తర్వాత కడుతున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని హెచ్చరించారు. అలాగే హైడ్రా ఏర్పడకముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లమని స్పష్టం చేశారు. గతంలో అనుమతులు తీసుకుని ఇప్పుడు నిర్మిస్తున్న వాటి వైపు వెళ్లమని రంగనాథ్ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటి కూల్చివేతలు తప్పవని స్పష్టం చేశారు.
కొత్తగా తీసుకున్న అనుమతులను హైడ్రా తనిఖీలు చేస్తుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. పేదవాళ్లు, చిన్నవాళ్ల జోలికి హైడ్రా రాదని చెప్పారు. పేదల ఇళ్లు హైడ్రా కూల్చివేస్తుందనే తప్పుడు ప్రచారం నమ్మొద్దని ఆయన నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
Be the first to comment