Hen For Rs.20 At Medaram Jatara : మేడారం మహా జాతర ఇవాళ్టి నుంచి 4 రోజుల పాటు వైభవంగా మొదలైంది. ఈ సందర్భంగా వన దేవతలను దర్శించుకునేందుకు భక్తులంతా లక్షలాదిగా తరలి వస్తున్నారు. సమ్మక్క సారలమ్మలను దర్శనం చేసుకొని బయటికి వచ్చాక కోడి పుంజును ఎగురవేస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే చాలామంది భక్తులు తాము కోరుకున్న కోరకలు నెరవేరితే కోడిపుంజును ఎగురవేస్తామని మొక్కుకున్నారని తెలిపారు. ఈ ఆచారం ప్రకారం కోడి పుంజును ఎగురవేయడానికి వచ్చిన భక్తులకు కొందరు ఒక్కొక్కరి వద్ద 10 లేదా 20 రూపాయలు వసూలు చేసి పుంజును ఇస్తున్నారు. దాంతో భక్తులంతా రూ.20 చెల్లించి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. మేడారం జాతరకు వచ్చిన భక్తులు, తమకు దర్శనం చాలా బాగా జరిగిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తామంతా గత కొన్ని సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఈ జాతరకు వస్తున్నారని అన్నారు. ఇలా కోడి పుంజును ఎగుర వేస్తే తమ కోరికలు నెరవేరుతాయని, అందుకే దర్శనం పూర్తిచేసుకుని ఇలా పుంజును ఎగుర వేస్తున్నారని తెలిపారు.
Comments