Hydra Demolitions in Alkapuri : రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ మున్సిపాలిటీ పరిధిలో అనధికారిక నిర్మాణాలపై మున్సిపాలిటీ, హైడ్రా అధికారులు కొరడా ఝుళిపించారు. అల్కాపురి టౌన్‌షిప్‌లోని 'అనుహార్ మార్నింగ్ రాగ అపార్ట్‌మెంట్స్'లో అనుమతి లేకుండా వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్నారన్న ఫిర్యాదులను పరిశీలించి, నాలుగు షట్టర్లను అధికారులను తొలగించారు. ఉదయం అక్కడికి చేరుకున్న హైడ్రా సిబ్బంది, పోలీసులు, మున్సిపల్ అధికారులను అపార్ట్‌మెంట్‌లోని పలువురు అడ్డుకున్నారు. వారి అభ్యర్థనలను పట్టించుకోని అధికారులు రెండు జేసీబీలతో షట్టర్లను ధ్వంసం చేశారు. దీంతో హైడ్రా, మున్సిపల్ అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర అగ్రహం వ్యక్తంచేశారు.
Be the first to comment