ఉప్పాడ తీరం కోతకు గురవుతున్న నేపథ్యంలో దాన్ని ఎలా రక్షించాలనే అంశంపై రేపు క్షేత్రస్థాయి పర్యటన చేస్తానని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. తీరం కోత గురించి నిపుణుల బృందం అధ్యయనం చేస్తుందన్నారు. కాకినాడ కలెక్టరేట్ లో పంచాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదల, అటవీ, పర్యావరణ విభాగాల అధికారులతో పవన్ సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేసిందని పవన్ మండిపడ్డారు.