Skip to playerSkip to main content
  • 6 years ago
Video Link : https://telugu.mykhel.com/cricket/cricket-world-cup-2019-west-indies-vs-pakistan-shai-hope-takes-a-stunner-to-get-rid-babar-azam/articlecontent-pf28107-020917.html

ICC World Cup 2019:A day after Ben Stokes stunned the world with his superhuman catch in the deep, it was West Indies wicketkeeper Shai Hope's turn on Friday (May 31) to show his athletic skills at Trent Bridge during their opening game against Pak in the Cricket World Cup 2019.
#iccworldcup2019
#wivspak
#shaihope
#babarazam
#benstokes
#surfrajahmed
#cricket

ఇంగ్లాండ్ వేదికగా గురువారం ప్రారంభమైన 12వ ఎడిషన్ వన్డే వరల్డ్‌కప్ అభిమానులకు అసలైన క్రికెట్ మజాను పంచుతుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకోగా... శుక్రవారం విండిస్ బౌలర్లు సమిష్టిగా రాణించి పాకిస్థాన్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు.
ముఖ్యంగా మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఆల్ రౌండర్లు అద్భుత ప్రదర్శన చేశారు. అటు బౌలింగ్‌లోనూ ఇటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటారు. ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ పట్టిన క్యాచ్‌ని మాజీ క్రికెటర్లు 'క్యాచ్‌ ఆఫ్‌ ది సెంచరీ'గా అభివర్ణిస్తుండగా... పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో విండిస్ ఆటగాళ్లు అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నారు.
ముఖ్యంగా వెస్టిండిస్ వికెట్ కీపర్ షాయ్‌ హోప్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌తో పాక్ ప్రధాన ఆటగాడు బాబర్‌ ఆజమ్‌ను ఔట్ చేసిన తీరు మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో థామస్‌ వేసిన ఓట్‌ స్వింగర్‌ బాబర్‌ బ్యాట్‌ అంచుకు తాకి పైకి లేవడంతో కీపర్‌ హోప్‌ అమాంతం తన కుడివైపునకు సమాంతరంగా డైవింగ్‌ చేస్తూ మెరుపు వేగంతో పట్టేశాడు.
మ్యాచ్ ఆరంభంలోనే బాబర్ అజామ్ ఔట్ కావడంతో పాకిస్థాన్ స్కోరు బోర్డుపై తీవ్ర ప్రభావం చూపింది. ఇందుకు సంబంధించిన వీడియోని ఐసీసీ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తోలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 21.4 ఓవర్లకు 105 పరుగులకు కుప్పకూలింది. తద్వారా వరల్డ్‌కప్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోరుని నమోదు చేసింది.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended