Skip to playerSkip to main content
  • 6 hours ago
Dwaraka Tirumala Rathotsavam : ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి రథోత్సవం సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఆశ్వయుజ మాస తిరుకల్యాణ మహోత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు రథంపై విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. క్షేత్ర పరిసరాల్లో విద్యుద్దీప కాంతులు వెదజల్లుతుండగా చినవెంకన్న శ్రీదేవి, భూదేవి సమేతుడై సాక్షాత్కరించారు. తొలుత రథాన్ని పూలు, విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామి అమ్మవార్లను ఆలయం వద్ద నుంచి తొళక్కం వాహనంపై రథం వద్దకు తోడ్కొని వచ్చారు. ఇలా విశేషంగా అలంకరించిన రథంలోని ప్రత్యేక వేదికపై స్వామి, అమ్మవార్లను ఉంచి అలంకరించారు. ఆలయ ఛైర్మన్ ఎస్వీ సుధాకరరావు, ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణలు, అర్చకుల వేదమంత్రోచ్ఛారణల నడుమ రథం తిరువీధులకు పయనమైంది. రథోత్సవాన్ని తిలకించేందుకు జనం వేలాదిగా తరలివచ్చారు. స్వామివారి రథోత్సవం ముందు కోలాట భజనలు, పలు వాయిద్యాల సందడి హోరెత్తించింది. 

Category

🗞
News
Transcript
00:00What

Recommended