Weather Update : ప్రస్తుతం బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది క్రమంగా ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశము ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తర్వాత అదే దిశలో పయనిస్తూ శనివారం నాటికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు కదులుతూ మరింత బలపడుతుందని అంచనా వేస్తోంది. ఇది తుపానుగా బలపడే అవకాశముందని కొన్ని వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి. దీని ప్రభావంతో శనివారం నుంచి సోమవారం వరకూ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తా యని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. శనివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ప్రకాశం, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని వెల్లడించింది.
A deep depression over the Bay of Bengal is intensifying and may develop into a cyclonic storm, says IMD. Key highlights: ✔ System moving north-northwest ✔ Likely to reach North Tamil Nadu & Puducherry coast by Saturday ✔ Possibility of intensification into a severe cyclone ✔ Heavy to very heavy rains in AP from Saturday to Monday ✔ SPSR Nellore, Chittoor, Tirupati – very heavy rain ✔ Prakasam, Annamayya, YSR Kadapa – heavy rainfall
Watch the full video for cyclone path, rainfall alerts & district-wise impact details.
Be the first to comment