Ongole Dairy Closed in YSRCP Regime : ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి పాడి రైతులకు బాసటగా నిలిచిన ఒంగోలు డెయిరీ జగన్ ప్రభుత్వ దెబ్బకు మూలనపడింది. వైఎస్సార్సీపీ పాలనలో పాల సేకరణకు స్వస్తి పలికి, అమూల్ సంస్థకు లీజుకు ఇచ్చారు. ప్లాంటు నిర్వహణ భారం అవుతోందని సదరు సంస్థ వదిలేయడంతో డెయిరీ పూర్తిగా మూతపడింది. దీంతో పాడి రైతులకు ఆసరా లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం మళ్లీ ఒంగోలు డెయిరీని తెరిపించాలని పాడి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.