Crocodile in Medak District : మొసళ్లను మనం సహజంగా జూపార్కులు, సరస్సులు, నదుల్లో మాత్రమే చూస్తుంటాం. అప్పుడప్పుడు భారీ వరదలు సంభవించిన సమయాల్లోనూ బయటపడుతుంటాయి. అలాంటి మొసలి నడి రోడ్డుపై పాకుతు కనిపిస్తే ఎవ్వరైనా జంకాల్సిందే. మెదక్ జిల్లాలో అచ్చం ఇలాంటి ఘటనే ప్రయాణికులకు ఎదురైంది.
మెదక్ పట్టణంలోని పసుపులేరు వాగు సమీపంలో మెదక్ -హైదారాబాద్ ప్రధాన రహదారిపై అర్థరాత్రి మొసలి ప్రత్యక్షమై కలకలం సృష్టించింది. అక్కడున్న ప్రయాణికులు ఆ మొసలిని చూసి భయభ్రాంతులకు గురైయ్యారు. ఆ రోడ్డు మార్గం గుండా వెళుతున్న ప్రయాణికులు మొసలిని తమ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియో కాస్త సోషల్ పోస్ట్ చేయగా మీడియాలో వైరల్ అయ్యింది.
Be the first to comment