Crops Cultivation In Mahbubnagar : ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యవసాయ ముఖచిత్రం ఈసారి భిన్నంగా కనిపిస్తోంది. సాధారణానికి మించి వర్షాలు కురిశాయి. కానీ సాధారణ సాగు విస్తీర్ణంతో పోల్చితే వానాకాలంలో పంటల సాగు 55శాతానికే పరిమితమైంది. వానలు కురుస్తున్నప్పటికీ భూగర్భ జలమట్టాలు మాత్రం గతేడాది జులైతో పోల్చితే ఒకటి నుంచి రెండున్నర మీటర్ల లోతుకు పడిపోయాయి. వానాకాలంలో అత్యధికంగా సాగుచేసే పత్తి పంట గణనీయంగా పడిపోయింది. పత్తి స్థానంలో కంది, మొక్కజొన్న, జొన్న సాగు పెరిగింది. వరి సాగు సైతం 100శాతానికి చేరుకోలేదు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పంటల సాగుతీరుపై కథనం.
Be the first to comment