Ongole Dairy Pathetic Condition: ఒకప్పుడు రోజుకు లక్షన్నర లీటర్ల పాల సేకరణతో ఆ డెయిరీ రాష్ట్రానికే తలమానికంగా నిలిచింది. కానీ ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ కక్షపూరిత నిర్ణయాలతో ముగిసిన చరిత్రగా మారింది. పాల సేకరణకు స్వస్తి పలికి, అమూల్ సంస్థకు లీజుకు ఇవ్వడంతో సర్వనాశనమైంది. తెలుగుదేశం హయాంలో పాడిగేదెల కొనుగోలుకు రుణాలు, రాయితీలు, దాణా, ఉచిత మందులు ఇలా ఎన్నో ప్రయోజనాలు పొందిన రైతులు, మళ్లీ ఒంగోలు డెయిరీని తెరిపించాలని కోరుకుంటున్నారు.