Snake Catcher Jayakar Special Story : పాములను చూస్తే చాలు.. భయంతో ఆమడ దూరం పరిగెడతాం. కానీ హనుమకొండకు చెందిన పుట్టా జయకర్ మాత్రం భయపడడు సరికదా వాటిని అవలీలగా పట్టేస్తాడు. పామొచ్చిందని ఒక్క ఫోన్ చేస్తే చాలు.. వెంటనే వచ్చి ఆ పామును పట్టేస్తాడు. ఇలా పట్టిన వాటికి ఏమాత్రం హాని చేయకుండా దూరంగా అడువుల్లో వదిలేస్తాడు. అలా వేలాది పాములు పట్టి రికార్డు నెలకొల్పాడు.