Minister Ponnam Prabhakar on Hydra Project : చెరువుల పరిరక్షణకు హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు జరుగుతాయని రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలపై స్పందించిన ఆయన రాష్ట్రంలో చెరువులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తామని తెలిపారు. తెలంగాణలో ముందుగా రాజధాని నగరంలో తర్వాత అన్ని జిల్లాల్లో ఏఏ చెరువులు ఆక్రమణకు గురయ్యాయో గుర్తిస్తారని, తర్వాత వాటి పునరుద్ధరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. భౌగోళిక పరిస్థితుల్లో వాతావరణ కాలుష్యం నుంచి పరిరక్షించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు.
Be the first to comment