Commissioner Ranganath about Hydra : కొద్ది రోజులు హడావిడి చేసి ఊరుకోవడం కాకుండా, ఎవరైనా ఆక్రమణలకు పాల్పడాలంటే భయపడేలా చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. కొంతమంది అక్రమ నిర్మాణాలకు అధికారిక అనుమతుల ముసుగు తొడుగుతున్నారని తెలిపిన రంగనాథ్, కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేలోగా వాటిని నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. ఎఫ్టీఎల్లోని ప్రతి అపార్ట్‌మెంట్ కూల్చాలనేది తమ ఉద్దేశం కాదన్నారు. వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న నిర్మాణాలను మాత్రమే నేలమట్టం చేస్తున్నామని హైదరాబాద్ వెస్ట్‌జోన్ బిల్డర్స్ అసోసియేషన్ సమావేశంలో రంగనాథ్ తెలిపారు.
Be the first to comment