Pardhi Gang Arrested In Hyderabad : హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై చోరీలకు పాల్పడుతున్న పార్థీ ముఠాను శుక్రవారం నల్గొండ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వివరాలను నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ వివరించారు. నల్గొండ, సైబరాబాద్, రాచకొండ, సంగారెడ్డి జిల్లాలో జాతీయ రహదారిలపై ఆగిన వాహనాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు, హత్యలకు పాల్పడ్డట్టు వివరించారు. నిందితుల నుంచి రూ.17 వేలు, స్క్రూ డ్రైవర్, రెండు కత్తెరలు, వెండి పట్టీలు, ఒక టార్చ్ లైట్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై రాష్ట్రవ్యాప్తంగా 32 కేసులు ఉన్నాయని చెప్పారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
Be the first to comment