Skip to playerSkip to main contentSkip to footer
  • 7 years ago
Devansh to play NTR's childhood role. Balakrishna said no to Mokshagna as young NTR
#NTRbiopic
#Balakrishna
#Mokshagna
#devansh

ఈ ఏడాది తెరకెక్కబోతున్న ప్రతిష్టాత్మక చిత్రాలలో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ఒకటి. స్వయంగా బాలకృష్ణే తన తండ్రి పాత్రలో నటిస్తుండడంతో ఈ చిత్రానికి అంతటి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ చిత్రం ఇటీవల భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవిత చరిత్ర తెలుగు వారి మదిలో ఎప్పటికి ఉండిపోవాలని బాలయ్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు తేజ ఈ చిత్రాన్ని రూపొందించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబందించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ బాల్యం నుంచి ఆయన జీవన శైలిని, జీవిత గాధని చూపించబోతున్నారు. ఈ నేపథ్యంలో బుల్లి ఎన్టీఆర్ పాత్రలో ఎవరు నటిస్తారు అనే మీమాంస కొనసాగుతోంది. యుక్త వయసులో ఎన్టీఆర్ పాత్రకు దర్శకుడు తేజ బాలయ్య తనయుడు మోక్షజ్ఞ పేరు సూచించారట. తేజ ప్రతిపాదనని బాలయ్య సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. మోక్షజ్ఞని సోలో హీరోగానే లాంచ్ చేయాలనే కోరికని బాలయ్య బయటపెట్టారట.
దీనితో మోక్షజ్ఞకు బదులుగా యువ ఎన్టీఆర్ పాత్రకు కళ్యాణ్ రామ్ తనయుడు శౌర్య రామ్ ని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక బాల ఎన్టీఆర్ పాత్రకోసం చంద్రబాబు మనవడు దేవాన్ష్ ని రంగంలోకి దింపుతారట. ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. మే నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ లోపు కాస్టింగ్ ఎంపిక పూర్తిచేసే పనిలో దర్శకుడు తేజ ఉన్నారు.

Recommended