Skip to playerSkip to main content
  • 21 minutes ago
Naguluppalapadu Polling : ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో అధికారుల తప్పిదాలతో పోలింగ్‌ విధులకు వచ్చిన వందలాది మంది సిబ్బంది ఆకలితో ఆలమటించారు. అరకొరగా భోజనాలు ఏర్పాటు చేయడం అందులోనూ ప్లేట్ల కొరతతో కడుపు నింపుకునేందుకు నానా అవస్థలు పడ్డారు. అనేక మంది ఆకలికి తాళలేక ఆందోళన బాటపట్టారు. మండలంలో మొత్తం 73 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి ఆరుగురు చొప్పున 438 మంది సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయించారు. వారితో పాటు పోలింగ్‌ ఏర్పాట్లు కోసం మరో 250 మంది వరకు వచ్చారు. సుమారు 7 వందల మంది విధుల్లో ఉండగా 3 వందల మందికి మాత్రమే అధికారులు భోజనం తెప్పించారు. వారికీ సరిపడా ప్లేట్స్‌ లేకపోవడంతో కొందరు ఆకలికి ఉండలేక డిస్పోజబుల్‌ గ్లాసుల్లోనే కొంచెం కొంచెం అన్నం తింటూ అవస్థలు పడుతూ ఆకలి తీర్చుకున్నారు. మిగిలిన వారు అవీ అందక భోజనం ఎప్పుడు వస్తుందో తెలియక ఆందోళనకు దిగారు. సిబ్బంది నిరసనతో స్పందించిన ఆర్వో దశలవారీగా అందరికీ భోజన సదుపాయం కల్పించారు. సంతనూతలపాడు మండలంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నాగులుప్పలపాడు మండలంలో నామినేషన్ల సమయంలోనూ విధుల్లో ఉన్న పోలీసులు మొదటిరోజు భోజనానికి ఇబ్బందులు పడ్డారు. దీంతో ఓ ఎస్సై రెండోరోజు తన సిబ్బందికి తానే స్వయంగా భోజన ఏర్పాట్లు చేయించారు.

Category

🗞
News
Transcript
00:00Thank you very much.

Recommended