Skip to playerSkip to main content
  • 1 week ago
Durga Matha Decoration With 55 Lakh : హైదరాబాద్​ అత్తాపూర్ సమీపంలోని హైందవ్ నగర్ పబ్బతి బాల ఆంజనేయ ఆలయ ప్రాంగణంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గత 21 ఏళ్లుగా శ్రీ ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో నవరాత్రులను నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ మహాలక్ష్మి అవతారంలో ఉన్న అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. రూ. 55లక్షల 55వేల 555 నోట్లతో అద్భుతంగా అలంకరించారు. గతేడాది 52 లక్షలతో అలంకరించిన నిర్వాహకులు ఈసారి ఆ మొత్తాన్ని మరింత పెంచారు. రంగురంగుల కరెన్సీ నోట్ల మధ్య కొలువుదీరిన అమ్మవారి రూపం భక్తులకు కనువిందు చేస్తోంది. ఛత్రపతి శివాజీ యూత్ సభ్యులు 70 మంది ఈ అలంకరణ వెనుక రేయింబవళ్లు కష్టపడ్డారు. కాలనీ వాసులు, చుట్టుపక్కల వారు, స్నేహితుల నుంచి సేకరించిన సొమ్ముతో అలంకరణ పూర్తి చేశారు. ఈరోజు రాత్రి వాటిని తిరిగి తొలగించి ఎవరి నగదు వారికి అందచేస్తారు. దీనికి సుమారు 3 రోజుల సమయం పడుతుంది.  

Category

🗞
News
Transcript
00:28Transcription by CastingWords
00:58Transcription by CastingWords
01:28Transcription by CastingWords
01:58Transcription by CastingWords
02:28Transcription by CastingWords
02:58Transcription by CastingWords
03:08Transcription by CastingWords
03:08Transcription by CastingWords
03:08Transcription by CastingWords

Recommended