Skip to playerSkip to main content
  • 2 weeks ago
Srinivasa Temple On Allipuram Road : తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో తెలంగాణలోనే తొలి శ్రీనివాసుని ఆలయ నిర్మాణ భూమి పూజ ఖమ్మం అల్లిపురం-కొత్తగూడెంలో కన్నుల పండువగా సాగింది. త్రిదండి చినజీయర్ స్వామి చేతుల మీదుగా శిలాన్యాస పూజలు జరిగాయి. శ్రీనివాసుడి ఆలయ నిర్మాణంలో అందరూ భాగస్వామ్యులవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. భూమిపూజ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో భక్తులు రావడంతో శంకుస్ధాపన జరిగిన పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూలైన్లలో వెళ్లి భూమిపూజ జరిగిన ప్రాంతంలో నవధాన్యాలు చల్లారు. శ్రీవారి దివ్య ప్రసాదమైన లడ్డూ, అన్నప్రసాదాన్ని స్వీకరించి పరమానందభరితులైయ్యారు. స్వామి ఆలయం త్వరగా నిర్మాణం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమలంలో పాల్గొన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బి.ఆర్.నాయుడు మాట్లాడుతూ రూ.వంద కోట్ల విలువైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం విశేషమని పేర్కొన్నారు.

Category

🗞
News
Transcript
00:01Thank you very much.
00:36Thank you very much.
01:08Thank you very much.
01:30Thank you very much.

Recommended