Telangana Creates Guinness Record with 3,000 Drones : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన రైజింగ్ గ్లోబల్ సమిట్ ముగింపు డిసెంబర్ 9న జరిగి వేడుకలో భారీ డ్రోన్ షో ఏర్పాటుచేసింది. తెలంగాణ రైజింగ్ - 2047 లక్ష్యాలు వివరించే థీమ్స్‌తో ఈ డ్రోన్ షోను ఏర్పాటు చేశారు. గతంలో అబుదాబిలో 2,131డ్రోన్ల హ్యాపీ న్యూయర్ అనే ప్రదర్శనకు గిన్నిస్‌బుక్ రికార్డు వరించింది. తాజాగా ఆ రికార్డును బ్రేక్ చేసేలా తెలంగాణ 3 వేల డ్రోన్లతో ప్రదర్శనను నిర్వహించింది. Telangana is Rising – Come, Join the Rise" అనే ఆంగ్ల వాక్యాన్ని ఆకాశంలో డ్రోన్లతో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి హాజరైన గిన్నిస్ వరల్డ్ సభ్యులు దీనిని రికార్డుగా గుర్తించారు. సీఎం రేవంత్‌రెడ్డికి ధ్రువపత్రాన్ని అందజేశారు. 2047నాటికి మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనుకున్న రాష్ట్రం గిన్నిస్ రికార్డ్ కైవసంతో అటువైపు అడుగులేయడం మొదలుపెట్టింది. ముగింపు వేడుకల సందర్భంగా బాణసంచా వెలుగుల్లో గ్లోబల్ సమిట్ ప్రాంగణమంతా వెలుగుల కాంతులతో నిండిపోయింది.
Be the first to comment