A massive volcanic eruption in Ethiopia’s Hayli Gubbi mountain — the first in nearly 12,000 years — has sent ash clouds drifting all the way to India. High-speed winds carried the volcanic plume across the Red Sea, reaching Gujarat, Rajasthan, Delhi, Haryana, and Punjab. The ash cloud disrupted major flight operations as Air India cancelled 11 flights and DGCA issued emergency advisories.
ఇథియోపియాలోని హేలీ గుబ్బి పర్వతం సుమారు 12,000 సంవత్సరాల తరువాత భారీగా విస్ఫోటనం చెందింది. ఈ విస్ఫోటనం నుంచి వెలువడిన బూడిద మేఘాలు వేగవంతమైన గాలులతో ఎర్ర సముద్రాన్ని దాటి నేరుగా భారతదేశానికి చేరాయి. గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ వరకు ఈ బూడిద వ్యాపించింది.
దీంతో విమాన రవాణాపై భారీ ప్రభావం పడగా, ఎయిర్ ఇండియా 11 ఫ్లైట్లను రద్దు చేసింది. DGCA అత్యవసర సూచనలు జారీ చేసింది.
Be the first to comment