Huge Python Spotted on Second Ghat Road of Tirumala : సాధారణంగా మనకు చిన్న పాము కనబడితేనే హడలెత్తిపోతాం. అలాంటిది మీరు వెళ్లే దారిలో ఏకంగా 12 అడుగుల పొడవైన కొండచిలువ మీకు ఎదురుపడితే మీరు ఏం చేస్తారు. వెంటనే మీకు భయంతో వణుకు పుడుతుంది కదూ! తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ఓ భారీ కొండ చిలువ ప్రత్యక్షమైంది. మంగళవారం రాత్రి సుమారు 9 గంటలకు ఘాట్ రోడ్డులోని వినాయక స్వామి ఆలయ సమీపంలో కొండచిలువ రోడ్డు పై నుంచి వెళ్తుంది. అది అటుగా వాహనాలలో వెళ్తున్న భక్తుల కంటపడింది. సుమారు 12 అడుగులున్న కొండచిలువ రోడ్డుకు అడ్డుగా రావడంతో వాహనదారులు తమ సెల్‌ఫోన్లలో దాన్ని చిత్రీకరించారు. రోడ్డుపై కొండ చిలువ ఉండటంతో కాసేపు వాహనాలు నిలిపారు. దీంతో స్వల్పంగా ట్రాఫిక్ ఏర్పడినట్లు భక్తులు తెలిపారు.ఇటీవల తిరుమల ఘాట్ రోడ్లలో తరుచూ పాములు తిరుగుతున్నాయి. దీంతో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు.
Be the first to comment