TEACHER PROVIDED BREAKFAST FOR STUDENTS: శ్రీ సత్య సాయి జిల్లా ఓబులదేవర చెరువు మండలం డబురువారిపల్లి ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు నాగరాజు విద్యార్థులకు ఉచిత అల్పాహారం అందజేస్తున్నారు. పాఠశాలలో చదివే విద్యార్థుల ఆకలి తీరుస్తూ ఉదారతను చాటుకుంటున్నారు. సొంత ఖర్చులతో విద్యార్థులకు టిఫిన్ పెడుతున్నారు.