Special Story On Nizamabad Teacher : సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర. కొందరు మాత్రం బడికి వచ్చామా వెళ్లామా అన్నట్టు ఉంటారు. వృత్తి బాధ్యత నిర్వర్తించడాన్నే భారంగా భావిస్తుంటారు. కానీ ఆయనకు మాత్రం వృత్తి కన్నా విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం. ఓ వైపు సామాజిక కార్యకర్తగా మూఢ నమ్మకాలు పారదోలుతూ మరోవైపు ఉపాధ్యాయుడిగా భావిభారత పౌరులను తయారు చేశారు. పదవీ విరమణ పొందినా సమాజానికి తనవంతుగా కృషిచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయనే నిజామాబాద్ జిల్లాకు చెందిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత నర్రా రామారావు మాస్టారు.