CM Revanth Reddy MLC Champaign : 11 ఏళ్ల ప్రధాని మోదీ పాలనలో రాష్ట్రానికి ఏం చేశారని, ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 2014, 2019 ఎన్నికల ప్రచారంలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలో 2 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, ఒకటి కిషన్‌రెడ్డికి మరొకటి బండి సంజయ్‌కు అని ఎద్దేవా చేశారు. వీరికి కాకుండా ఇంకెవరికైనా ఇచ్చారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల, కరీంనగర్‌లో పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
Be the first to comment