Messi the GOAT Tour of India : ద గోట్ ఇండియా టూర్లో భాగంగా ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సి హైదరాబాద్ పర్యటన చేశారు. ఈ పర్యటనతో అభిమానుల్లో ఫుల్ జోష్ నింపారు. శనివారం సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో వేల సంఖ్యలో అభిమానుల మధ్య మెస్సి ఆటను ఆడాడు. స్టేడియం అంతా మెస్సి మెస్సి మెస్సి అంటూ ఊర్రూతలు ఊగిపోయారు. పిల్లలు, యువత కేరింతలతో మైదానం సందడిగా మారింది. ఇరు ఫుట్‌బాల్ జట్లతో మెస్సి కాసేపు సరదాగా మ్యాచ్ ఆడటమే కాదు మైదానం మొత్తం కలియదిరిగారు. అభిమానులకు అభివాదం చేస్తూ మధ్యమధ్యలో బంతులను కిక్ చేసి అభిమానుల మధ్యలోకి పంపించారు.స్టేడియంలో సీఎం రేవంత్ గోల్స్ చేయడంతో ప్రేక్షకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘ద గోట్ మెస్సి’ అంటూ నినదించారు. మెస్సితో పాటు ఫుట్‌బాల్ క్రీడాకారులు రోడ్రిగో డి పాల్, లూయిస్ సువారెజ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి మనవడు ఫుట్‌బాల్ కిక్ చేశాడు. ఉప్పల్ స్టేడియంలో మెస్సి ఉన్న గంటసేపు పండగ వాతావరణమే నెలకొంది.
Be the first to comment