Prakasam Dist Earthquake Today : ప్రకాశం జిల్లాలో పలుచోట్ల స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ముండ్లమూరు, తాళ్లూరు, శంకరాపురం, పోలవరం, పసుపుగల్లులో వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడు, గంగవరం, రామభద్రాపురం, శంకరాపురంలో భూప్రకంపనలు వచ్చాయి. ముండ్లమూరు పాఠశాల నుంచి విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు బయటకు వచ్చారు. పలు గ్రామాల్లో రెండు సెకండ్లపాటు భూకంపం సంభవించడంతో ఇళ్లలోని వస్తువులు అన్ని కదిలాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఏం జరిగిందో తెలియక ఇళ్లలో నుంచి బయటకు వచ్చామని స్థానికులు పేర్కొన్నారు.
Be the first to comment