Hydra Demolished Illegal Construction at Almasguda : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని అల్మాస్‌గూడలో హైడ్రా బుల్డోజర్లతో విరుచుకుపడింది. అక్కడి బోయప్లలి ఎంక్లేవ్ కాలనీలో రహదారికి అడ్డంగా ప్రహరీని నిర్మించారని స్థానికుల ఫిర్యాదుపై స్పందించిన హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమ నిర్మాణాలను తొలగించారు. బోయపల్లి ఎంక్లేవ్ కాలనీ లేఅవుట్‌లో దాదాపు సగం ప్లాట్లను కలుపుతూ నిర్మించిన ప్రహరీతో ఇతర ప్లాట్ల యజమానులు వెళ్లేందుకు రహదారి లేదు. దీంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని హైడ్రా దృష్టికి తీసుకొచ్చారు.
Be the first to comment